FIGHT COVID-19

కరోనా మహమ్మారికి నివారణ ఒక్కటే మార్గం. 
అందరూ విధిగా తమ ఇళ్లలోనే ఉండండి.


Stay Home Stay Safe # Corona

Indian Institute of Health & Family Welfare

Government of Telangana
Click the link below to know complete information regarding fight against CORONAVIRUS (COVID -19)




మే 03వ తేది వరకు లక్ డౌన్ పొడిగింపు

కరోనా మహమ్మారికి నివారణ ఒక్కటే మార్గంఅందరూ విధిగా ఈ లాక్ డౌన్ కాలంలో తమ ఇళ్లలోనే ఉండండి, ప్రజల శ్రేయస్సుకై అహర్నిశలు పరితపించే అధికారుల ఆంక్షలకు అనుగుణంగా వ్యవహరించండి వారికి సహకరించండి.

మనవంతుగా... 
ఈ విపత్కరమైన క్లిష్ట పరిస్థితులలో రాష్ట్రంలో ఉన్న అన్నీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలకు సేవలందించే దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు మరియు ఈ దస్తావేజు లేఖన వృత్తి ద్వారా ఉపాధి పొందే చిరు ఉద్యోగులు అందరూ సమాజం పట్ల తమవంతు భాద్యతగా ప్రభుత్వం చేపట్టే సహాయక చర్యలకు చేదోడుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మానవత్వంతో ముందుకు వొచ్చి తమ సహాయ సహకారాలు అందించగలరు.

మన ఈ వ్యవస్థను అందరూ  ఆదరించాలని ఈ వ్యవస్థ ద్వారా అందరికి మేలు జరగాలని ఆశిస్తున్నాము.

"సర్వేజనా సుఖినో భవంతు"

అట్టి సంకల్పంతో లక్ష్య సాధన దిశగా ఈ వ్యవస్థ మునుముందుకు సాగాలని అందుకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు మాకందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
                              
ఇట్లు

మీ
S.B.Yadav (సంగం బాలాజీ) 
B.Com., M.B.A., (LL.B)
Blog Editor -  dwaaram (
ద్వారం)
https://www.blogger.com/profile/01898430331694300745
email: dwaaram@gmail.com

To Donate Online to CM Relief Fund visit:




సంఘటిత శక్తి ప్రాముఖ్యత

ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణంలో ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో నిర్విరామంగా జరుపుతున్న పోరులో భాగంగా అందరిలో ఈ మహమ్మారి నివారణ పై అవగాహన మరియు భిన్నత్వంలో ఏకత్వం కొరకై అన్నిరకాల సవాళ్లనూ ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి రావాలని కోరుకుంటు కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర  గవర్నర్‌ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్‌ గారు ప్రజలకు 05 ఏప్రిల్ 2020 నాడు రాత్రి 9 గంటలకు ఎవరి ఇంట్లో వారు విద్యుత్‌ను 9 నిమిషాలపాటు ఆపేసి దీపాలుకొవ్వొత్తి వెలిగించాలనిటార్చ్‌లైట్‌మొబైల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ను వేయాలని తెలిపారు. ఈ సత్సంకల్పాన్నికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్లచంద్రశేఖర్ రావు గారు తన సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ, అందరూ విధిగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఆచరించాలి అని ప్రజలకు సూచించారు కాగా ఈ సంధర్భంగా ఎవ్వరూ కూడా తమ ఇండ్ల నుంచి బయటకు గుంపులుగా రావొద్దనిరోడ్లపైకి వెళకూడదన్నారు. ప్రజలు తమ ఇండ్ల ద్వారాలుబాల్కనీలోనే ఉండి తగు జాగ్రత్త వహించి పెద్దవారి పర్యవేక్షణలో సురక్షితంగా జ్యోతులు వెలిగించాలని సూచించారు.



కావున మనమందరం సౌభ్రాతృత్వంతో ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యంతో ఒక్కటై ఒక చక్కటి అవగాహనతో కరోనా మహమ్మారిని కట్టడి చేసుకుందాం మన శ్రేయోభిలాషుల పిలుపుమేరకు కరోనా మహమ్మారి వల్ల కమ్ముకొస్తున్న చీకటిని చీల్చేందుకు మనం అందరం జ్యోతులు వెలిగించి ఒక నూతనోత్సాహంతో మన సంఘటిత శక్తితో కరోనా మహమ్మారిని నివారించి జయించగలం అని మన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. ఇట్టి సత్సంకల్పంలో మనమందరం విధిగా పాలుపంచుకుందాం.



అసతోమా సద్గమయ  తమసోమా జ్యోతిర్గమయా  
మృత్యోర్మా అమృతంగమయ  ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనా సుఖినోభవంతు 
 సమస్థ  సన్మంగళాని భవంతు

భావము: చీకటి నుంచి వెలుగు వైపుగాఅశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా, మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం తద్ద్వారా లోకంలో అందరూ సుఖశాంతులతో ఉండాలీ అని అర్ధం .

ఇట్లు

మీ
కిరణ్ కుమార్ క్యాదారి


No comments:

Post a Comment