Monday 10 July 2017

మౌనం ! అది మనపాలిట శాపం !

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు !!!

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అలాగే మనం కూడా వృత్తి మనుగడ కోసం మన సేవల ప్రాముఖ్యత అందరికీ అర్థమైయ్యే రీతిలో, ప్రభుత్వం సకాలంలో మన వ్యవస్థను సరైన రీతిలో గుర్తించే దిశగా మన ప్రయత్నం తీవ్రతరం చేయాలి, మనకు పరిపూర్ణంగా మరియు క్షుణ్ణంగా తెలియని ప్రభుత్వ భవిష్యత్ తీర్మాణాలను అపార్ధం చేసుకొని తప్పుగా ఊహించుకొని పాలకులను నిందిచడం మాని, కనీసం ఇప్పటికైనా ఆలోచనతో, విజ్ఞ్యతతో, సోదరభావంతో, మానవత్వంతో అందరం కలసికట్టుగా వ్యవహరించడానికి ప్రయత్నిద్దాం మన జీవనాధారాన్ని కాపాడుకుందాం.

నాడు మన మనుగడ కొరకు సల్పిన పోరాటంలో మనమందరం కలిసికట్టుగా ఒక్కటై నేటి పాలకుల సారధ్యంలో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక్క భారీ ప్రభంజనం సృష్టించాము, అలా రాష్ట్ర సాధనలో ఒక్క కీలక పాత్ర పోషించిన మనమంతా సేవే పరమావధిగా ఎంతో విలువలతో కూడినట్టి దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ అనుబంధ సేవలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విద్యావంతులు ఏర్పర్చుకున్న స్వయంఉపాది మన వృత్తి, అట్టి గౌరవ వృత్తి అంతరించి పోకుండా అందరమూ ఒక్కటై, ఒక చక్కటి ప్రణాళికతో పాలకుల ఒప్పించి ప్రజలకు మన సేవలు అందిద్దాం, అలా మన వృత్తికి సరైన గుర్తింపు సాధించుకుందాం.

నేడు మన వృత్తిపైన సరైన అవగాహన లేని వారు విచక్షణారహితంగా పవిత్రమైన మన వృత్తిని నోటికొచ్చినట్టుగా పత్రికలలో హీనంగా మధ్యవర్తులు, బ్రోకర్లు, దుర్మార్గులు, దగాకోరులు అని దిగజార్చి సంభోదిస్తుంటే, విగ్రహాలలా చోద్యం చూస్తూ ఉందామా ? 
(లేక)
మనకు కొన్ని విలువలు ఉన్నాయి, అవి దృష్టిలో ఉంచుకొని మర్యాదగా సంభోదించాలని గుర్తు చేద్దామా?

మనకెందుకు అన్న వైఖరి అందరం అవలంబించుకుందాం, జరిగేది జరగక మానదు అనుకోని మౌనం వహిద్దామా?
(లేక)
స్వార్థం మరియు భయంచే బందీగా బ్రతికితే నీవు రేపు నీ వెంట నీ నీడ కూడా వొస్తుందో లేదో అని అను క్షణం అనుమానంతో, ఆత్మవంచన చేసుకొని కుములుతూ నీ తప్పుకు వ్యవస్థను నిందించుకుంటూ బ్రతుకుదామా?
(లేక)
సమిష్టిగా, అంటే ఒకరి కొరకు అందరం అన్నట్టుగా కలిసికట్టుగా ఒక్కటై నిబద్ధతతో మన వృత్తిని నిజాయితీగా ఆచరించి మన విలువలను కాపాడుకుందామా?

పోన్లే పనికిమాలిన సోది అనుకుంటే ఎలా ఉంటుందో ఏమత్రం ప్రమేయం లేకున్నా ఊహించని పరిస్థితి ఎదురై అమాయకమైన నీ జీవితం అగమ్యగోచరంగా మారినప్పుడు తెలుస్తుంది, ఆ నొప్పేమిటో ఆ వ్యధ ఏమిటో.

ఈనాటి మన ఉరుకులు పరుగుల జీవితంలో మనలో ఒక్కరికి ఆపద వాటిల్లినప్పుడు కనీస మానవత్వంతో మందలించడానికి కూడా సమయం ఇవ్వలేని మనము మనుషులమేనా..? అనిపించి, మనలో ఇలాంటి స్వార్థ భరితమైన ఆలోచనా విధానం మన వృత్తి మనుగడను కూడా అంతరించివేస్తుందన్న ఒకేఒక్క అంశం ద్వారం పుట్టుకకు కారణం, దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ అనుబంధ సేవల ప్రాముఖ్యత అందరికీ తెలపడం తత్ద్వారా మన వృత్తికి సరైన విలువలతో కూడిన గుర్తింపు సాధించుకోవడం ద్వారం ముఖ్య లక్ష్యం.

ద్వారం దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ అనుబంధ సేవల వృత్తి వ్యవస్థకు సహకరించే, సంక్షేమం కోరే ప్రతిఒక్కరి నేస్తం....

ఇట్లు

మీ
సంగం బాలాజీ  
B. Com., M. B. A., LL. B.
Blog Editor -  dwaaram (ద్వారం)
https://www.blogger.com/profile/01898430331694300745
email: dwaaram@gmail.com

Saturday 8 July 2017

అభ్యర్ధన

పాలకులకు దస్తావేజు లేఖరుల వినమ్ర అభ్యర్ధన

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పట్ల అవగాహన కలిగి ఉండి, భూ లావాదేవీలను బట్టి విలువల ఆధారంగా నిర్దేశించిన నిబంధనలకు తగ్గట్లుగా ఒప్పుకున్న ఒప్పందాన్ని మాటల్లో కాక రాతలో సందర్భానికి అనుగుణంగా నిజాన్ని అక్షర రూపంలో పొందుపరచి విధిగా అట్టి దస్తవేజుని విషయ పరిజ్ఞానం ఉండి చట్టాన్ని అతిక్రమించకుండా తయ్యారు చేసి రిజిస్టర్ చేయించు కీలకమైన వ్యక్తి ఒక్క దస్తావేజు లేఖరి. ఇంలాంటి వ్యవస్థలోని ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషి సలుపుతూనే ఉన్నాడు కాగా ఈ వ్యవస్థ సంఘటిత శక్తిని పాలకులు సరియన రీతిలో గుర్తించి తగు గుర్తింపు ఇవ్వగలరు.

అదేకాక ఒక్క దస్తావేజు లేఖరి రిజిస్ట్రేషన్ శాఖా ద్వారా లభించే సేవలను సాధారణ ప్రజలకు సులువుగా సహకరించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాడు ఉదాహరణకు..

Ø ఒక్క స్థిరాస్తి కొనే ముందు ప్రప్రథమంగా తీసుకోవలసిన అభిప్రాయం ఆ భూమి స్వభావం అంటే ప్రభుత్వ భూమా లేదా ప్రవేటు భూమా తెలుసుకునేందుకు కావలసిన తగు వివరాలు విధిగా సాధారణ ప్రజలకు తెలియ పరచడం మరియు కావలసిన E.C., C.C., Market Value & etc., సులభంగా పొందుటకు సహకరించడం.

Ø నేడు వివిధ అవసరాల తగ్గట్టుగా ప్రజలకు సంభందించిన పత్రాల పై స్టాంప్ డ్యూటీ అధికారికంగా (ఫ్రాంకింగ్/Franking) చేయించుటకై ఉన్న విధానాన్ని అందుకు కావలసిన ప్రక్రియను సులభంగా పొందేందుకు చల్లాన్ (eChallan) లాంటి సేవలు అందించడం.

Ø పిల్లలను దత్తతను తీసుకునే వారికి దత్తత పత్రం (Adoption Deed) రిజిస్టర్ సులభంగా పొందేందుకు సేవలు అందించడం, సాధారణ ప్రజలు తమ వివాహం మరియు ఇతర చట్టబద్దమైన వ్యవహారాలను రిజిస్టర్ చేయించు ప్రక్రియను సులభంగా పొందేందుకు సేవలు అందించడం.

Ø అలా అన్నీ నిభంధనలకు అనుకూలంగా ఉన్నపుడు స్థిరాస్థి సంభందిత వ్యవహారానికి మరియు అవసరానికి అనుగుణంగా సరియగు క్రియ, దాన, భాగ పరిష్కార, హక్కు విడుదల, విల్లు, సవరణ, ధృవీకరణ,  హామీ, తనఖా, లీజు, భాగస్వామ్య, పవర్ ఒఫ్ అటార్నీ (G.P.A) లాంటి దస్తావేజులు తయ్యారు చేసి విధిగా రిజిస్టర్ చేయించు ప్రక్రీయను సులభంగా పొందేందుకు సేవలు అందించడం.

ఇలా సాధారణ ప్రజల కుల, మత, వర్గ, వర్ణ వివక్షత లేకుండా రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ శాఖకు అనుబంధంగా సేవలు అందించడం ద్వారా దస్తవేజు లేఖరి వృత్తికి సమాజంలో ఒక్క ప్రత్యేక గుర్తింపు ఉంది.

D W A A R A M
D - దస్తావేజు 
W - వ్రాసి 
A - అందరికి
A - అనుగుణంగా 
R - రిజిస్ట్రేషన్ 
A - అమలుపరిచే 
M - మిత్రవ్యవస్థ

ఇట్టి వృత్తిని పాలకులు ఉన్నతాధికారులు గుర్తించి, దైనందన జీవనంలో అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సేవలోనే ఉన్న మా పవిత్ర వృత్తికి క్షుణ్ణంగా విశ్లేషించి ఒక్క చక్కటి ప్రణాళిక ద్వారా ఈ వృత్తిపై ర్రాష్ట వ్యాప్తంగా ఆధారపడి వారి జీవనోపాదిని ఏర్పరుచుకున్న దాదాపుగా వేల సంఖ్యలో ఉన్న విద్యావంతులైన దస్తవేజు లేఖరులు మరియు వారివద్ద పనిచేసుకొనే చిరుఉద్యోగుల జీవన్మరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, లక్షల సంఖ్యలో ఉన్న వారిపై ఆధారపడి ఉన్న వారి వారి కుటుంభసభ్యుల జీవితాలను ప్రభుత్వం ఆదుకొగలరు అని మా వినమ్ర అభ్యర్ధన.

ఇంలాంటి వ్యవస్థలోని ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషి సలుపుతూనే ఉన్నాడు, కాగా ఈ వ్యవస్థ సంఘటిత శక్తిని పాలకులు సరైన రీతిలో గుర్తించి తగు గుర్తింపు ఇవ్వగలరు.

ఇటువంటి బృహత్తర ప్రక్రియలో మా వంతు సహకారం కూడా మీరు పరిగణించ గలరు, అందుకు మేము ఎల్లవేళలా సిద్ధం అని తెలియయ్జేస్తుంది ద్వారం .