Tuesday 14 April 2020

1,00,000 + Views

ద్వారం వెబ్సైట్ వేక్షించే వారు ఈనాడు అనగా 14వ తేది ఏప్రిల్ 2020 నాటికి లక్ష సార్లకు పైగా (1,00,000 +) వీక్షించారు. ఈ శుభసందర్భాన ద్వారం వీక్షించి ద్వారం ద్వారా సులువుగా లభించే అందరికీ ఉపయోగకరమైన సమాచారం తెలుసుకొని ఒక చక్కటి అవగాహనతో తమ కార్యక్రమాల్లో ఏ తప్పు దొర్లకుండా సరైన రీతిలో లబ్ధి పొందే వారు మరియు ఈ ప్రయత్నాన్ని తమకు ఉపయోగకరంగా భావించే ప్రతిఒక్కరికి ద్వారం సభ్యుల ప్రత్యేక ధన్యవాధాలు.
D W A A R A M

D - దస్తావేజు 
W - వ్రాసి 
A - అందరికి
A - అనుగుణంగా 
R - రిజిస్ట్రేషన్ 
A - అమలుపరిచే 
M - మిత్రవ్యవస్థ

ద్వారం ద్వారా దస్తావేజు లేఖన మరియు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ సంబంధిత సేవల విషయంలో దస్తావేజు లేఖరులకు మరియు సంబంధిత సమాచారం శోధించే వారికి ఉపయోగకరమైన వివరాలు మెరుగైన రీతిలో నవీకరించబడిన సమాచారంతో అందరికీ అందుబాటులో తెచ్చే మా ఈ ప్రయత్నంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు మీ విలువైన సలహాలు మరియు సూచనల ద్వారా సహకరించాలని కోరుతూ.

ఇట్లు

మీ
సంగం బాలాజీ  
B.Com., M.B.A., LL.B.
Blog Editor -  dwaaram (
ద్వారం)
https://www.blogger.com/profile/01898430331694300745
email: dwaaram@gmail.com

నేటి ప్రాముక్యత

1. భారత రాజ్యాంగ రూపకర్త Dr.బి. ఆర్. అంబేద్కర్ గారి 129వ జయంతి
2. మే 03వ తేది వరకు లక్ డౌన్ పొడిగింపు

భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,
129వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు - ద్వారం



మే 03వ తేది వరకు లక్ డౌన్ పొడిగింపు

Monday 6 April 2020

అభ్యర్ధన

పాలకులకు దస్తావేజు లేఖరుల వినమ్ర అభ్యర్ధన
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పట్ల అవగాహన కలిగి ఉండి, 
భూ లావాదేవీలను బట్టి విలువల ఆధారంగా నిర్దేశించిన నిబంధనలకు తగ్గట్లుగా ఒప్పుకున్న ఒప్పందాన్ని మాటల్లో కాక రాతలో సందర్భానికి అనుగుణంగా నిజాన్ని అక్షర రూపంలో పొందుపరచి విధిగా అట్టి దస్తావేజుని విషయ పరిజ్ఞానం ఉండి చట్టాన్ని అతిక్రమించకుండా రిజిస్టర్ చేయించు కీలకమైన వ్యక్తి ఒక్క దస్తావేజు లేఖరి. ఇంలాంటి వ్యవస్థలోని ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషి సలుపుతూనే ఉన్నాడు కాగా ఈ వ్యవస్థ సఘటిత శక్తిని పాలకులు సరియన రీతిలో గుర్తించి తగు గుర్తింపు ఇవ్వగలరు.

అదేకాక ఒక్క దస్తావేజు లేఖరి రిజిస్ట్రేషన్ శాఖా ద్వారా లభించే సేవలను సాధారణ ప్రజలకు సులువుగా సహకరించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాడు ఉదాహరణకు..

Ø ఒక్క స్థిరాస్తి కొనే ముందు ప్రప్రథమంగా తీసుకోవలసిన అభిప్రాయం ఆ భూమి స్వభావం అంటే ప్రభుత్వ భూమా లేదా ప్రవేటు భూమా తెలుసుకునేందుకు కావలసిన తగు వివరాలు విధిగా సాధారణ ప్రజలకు తెలియ పరచడం మరియు కావలసిన E.C., C.C., Market Value & etc., సులభంగా పొందుటకు సహకరించడం.

Ø నేడు వివిధ అవసరాల తగ్గట్టుగా ప్రజలకు సంభందించిన పత్రాల పై స్టాంప్ డ్యూటీ అధికారికంగా (ఫ్రాంకింగ్/Franking) చేయించుటకై ఉన్న విధానాన్ని అందుకు కావలసిన ప్రక్రియను సులభంగా పొందేందుకు చల్లాన్ (eChallan) లాంటి సేవలు అందించడం.

Ø పిల్లలను దత్తతను తీసుకునే వారికి దత్తత పత్రం (Adoption Deed) రిజిస్టర్ సులభంగా పొందేందుకు సేవలు అందించడం, సాధారణ ప్రజలు తమ వివాహం మరియు ఇతర చట్టబద్దమైన వ్యవహారాలను రిజిస్టర్ చేయించు ప్రక్రియను సులభంగా పొందేందుకు సేవలు అందించడం.

Ø అలా అన్నీ నిభంధనలకు అనుకూలంగా ఉన్నపుడు స్థిరాస్థి సంభందిత వ్యవహారానికి మరియు అవసరానికి అనుగుణంగా సరియగు క్రియ, దాన, భాగ పరిష్కార, హక్కు విడుదల, విల్లు, సవరణ, ధృవీకరణ,  హామీ, తనఖా, లీజు, భాగస్వామ్య, పవర్ ఒఫ్ అటార్నీ (G.P.A) లాంటి దస్తావేజులు తయ్యారు చేసి విధిగా రిజిస్టర్ చేయించు ప్రక్రీయను సులభంగా పొందేందుకు సేవలు అందించడం.

ఇలా సాధారణ ప్రజల కుల, మత, వర్గ, వర్ణ వివక్షత లేకుండా రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ శాఖకు అనుబంధంగా సేవలు అందించడం ద్వారా దస్తావేజు లేఖరి వృత్తికి సమాజంలో ఒక్క ప్రత్యేక గుర్తింపు ఉంది.

D W A A R A M
D - దస్తావేజు 
W - వ్రాసి 
A - అందరికి
A - అనుగుణంగా 
R - రిజిస్ట్రేషన్ 
A - అమలుపరిచే 
M - మిత్రవ్యవస్థ

ఇట్టి వృత్తిని పాలకులు ఉన్నతాధికారులు గుర్తించి, దైనందన జీవనంలో అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సేవలోనే ఉన్న మా పవిత్ర వృత్తికి క్షుణ్ణంగా విశ్లేషించి ఒక్క చక్కటి ప్రణాళిక ద్వారా ఈ వృత్తిపై ర్రాష్ట వ్యాప్తంగా ఆధారపడి వారి జీవనోపాదిని ఏర్పరుచుకున్న దాదాపుగా వేల సంఖ్యలో ఉన్న విద్యావంతులైన దస్తావేజు లేఖరులు మరియు వారివద్ద పనిచేసుకొనే చిరుఉద్యోగుల జీవన్మరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, లక్షల సంఖ్యలో ఉన్న వారిపై ఆధారపడి ఉన్న వారి వారి కుటుంభసభ్యుల జీవితాలను ప్రభుత్వం ఆదుకొగలరు అని మా వినమ్ర అభ్యర్ధన.

ఇంలాంటి వ్యవస్థలోని ప్రతి వ్యక్తి సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషి సలుపుతూనే ఉన్నాడు, కాగా ఈ వ్యవస్థ సంఘటిత శక్తిని పాలకులు సరైన రీతిలో గుర్తించి తగు గుర్తింపు ఇవ్వగలరు.

ఇటువంటి బృహత్తర ప్రక్రియలో మా వంతు సహకారం కూడా మీరు పరిగణించ గలరు, అందుకు మేము ఎల్లవేళలా సిద్ధం అని తెలియజేస్తుంది ద్వారం.

Sunday 5 April 2020

Unity in Diversity


సంఘటిత శక్తి ప్రాముఖ్యత

ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణంలో ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో నిర్విరామంగా జరుపుతున్న పోరులో భాగంగా అందరిలో ఈ మహమ్మారి నివారణ పై అవగాహన మరియు భిన్నత్వంలో ఏకత్వం కొరకై అన్నిరకాల సవాళ్లనూ ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి రావాలని కోరుకుంటు కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర  గవర్నర్‌ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్‌ గారు ప్రజలకు 05 ఏప్రిల్ 2020 నాడు రాత్రి 9 గంటలకు ఎవరి ఇంట్లో వారు విద్యుత్‌ను 9 నిమిషాలపాటు ఆపేసి దీపాలు, కొవ్వొత్తి వెలిగించాలని, టార్చ్‌లైట్‌, మొబైల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ను వేయాలని తెలిపారు. ఈ సత్సంకల్పాన్నికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్లచంద్రశేఖర్ రావు గారు తన సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ, అందరూ విధిగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఆచరించాలి అని ప్రజలకు సూచించారు కాగా ఈ సంధర్భంగా ఎవ్వరూ కూడా తమ ఇండ్ల నుంచి బయటకు గుంపులుగా రావొద్దని, రోడ్లపైకి వెళకూడదన్నారు. ప్రజలు తమ ఇండ్ల ద్వారాలు, బాల్కనీలోనే ఉండి తగు జాగ్రత్త వహించి పెద్దవారి పర్యవేక్షణలో సురక్షితంగా జ్యోతులు వెలిగించాలని సూచించారు.


కావున మనమందరం సౌభ్రాతృత్వంతో ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యంతో ఒక్కటై ఒక చక్కటి అవగాహనతో కరోనా మహమ్మారిని కట్టడి చేసుకుందాం అలాగే మన శ్రేయోభిలాషుల పిలుపుమేరకు కరోనా మహమ్మారి వల్ల కమ్ముకొస్తున్న చీకటిని చీల్చేందుకు మనం అందరం జ్యోతులు వెలిగించి ఒక నూతనోత్సాహంతో మన సంఘటిత శక్తితో కరోనా మహమ్మారిని నివారించి జయించగలం అని మన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. ఇట్టి సత్సంకల్పంలో మనమందరం విధిగా పాలుపంచుకుందాం.



అసతోమా సద్గమయ  తమసోమా జ్యోతిర్గమయా  
మృత్యోర్మా అమృతంగమయ  ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనా సుఖినోభవంతు  
సమస్థ  సన్మంగళాని భవంతు

భావము: చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా, మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం తద్ద్వారా లోకంలో అందరూ సుఖశాంతులతో ఉండాలీ అని అర్ధం .

ఇట్లు

మీ
కిరణ్ కుమార్ క్యాదారి

Friday 3 April 2020

Editorial

సంపాదకీయం

కరోనా సంక్షోభం పై నా అభిప్రాయం..

దస్తావేజు లేఖరులమైన మనం లాక్ డౌన్  సందర్భంగా 22 మార్చ్ 2020 నుండి ఇంటికే పరిమితమై నేటికి పది రోజుల గడిచాయిఇంకా కూడా మనం 14 ఏప్రిల్ 2020 వరకు ఇదే పరిస్థితి కొనసాగించాలి. ఈ సందర్భంగా మనం మన భాధ్యతల ప్రాధాన్యత సరైన రీతిలో నిర్ధారించడానికి నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నా.

ఈ లాక్ డౌన్ కాలంలో మన ఇళ్లల్లో మనం బ్రతకడానికి సరిపడా సరుకు సమకూర్చుకున్నాం ఇంకా కావాలనుకుంటే సమకూర్చుకునే స్తోమత మనకు ఉందేమో కానీ నేటి విషమ పరిస్థితుల్లో మన వద్ద పని చేసే చిరు ఉద్యోగులు ఇంటివద్దే ఉన్న వారికి మరియు మనలో ఉన్న బీద కుటుంబాలకు ఎంత మేరకు మనం ఆదుకున్నామో ఆత్మవిమర్శ చేసుకొని మన ఔదార్యం చాటుదాం.

ఇకపోతే ఉన్నంతలో ఏమి వొచ్చిన రాకున్నా మన దస్తావేజు లేఖరుల కార్యాలయాలకు నెలసరి రెంట్లుఉద్యోగులకు నెలసరి జీతాలుతప్పనిసరిగా చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించుకోవాలి అది విస్మరించి ఏదైనా సామాజిక భాధ్యత వైపు దృష్టిసారించె ముందు మనం ఎవ్వరికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక్కసారి ఆలోచనతో వ్యవహరించండి.

ఈ మహమ్మారి వల్ల ఉన్నపలాన అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిందికాగా ఈ కుదేలయిన ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడ్డ సంక్షోభం నుండి ఇప్పట్లో మనం కోలుకోవడం ఒక కష్టమైన పనేకాబట్టి కలసి కట్టుగా ఉండి ముందు మనపై ఆధారపడి ఉన్నవారికి చేతనైనంత వరకు అండగా ఉండేందుకు ప్రయత్నిద్దాం ఆ తరువాతే ఏదైనా.

నా ఈ అభిప్రాయం కేవలం మనలో ఉన్న సంపన్నులను ఉదేశించి ఏ మాత్రం కాదుఈ విపత్కర పరిస్థితుల్లో మన పై ఆధార పడి బ్రతుకుతున్న బీద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తపరిచాను.

దయచేసి నా అభిప్రాయంలో ఉన్న మంచి గ్రహించగలరు.....

ఇట్లు

మీ
సంగం బాలాజీ   
B. Com., M. B. A., LL. B.
Blog Editor -  dwaaram 
email: dwaaram@gmail.com