Sunday, 5 April 2020

Unity in Diversity


సంఘటిత శక్తి ప్రాముఖ్యత

ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణంలో ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో నిర్విరామంగా జరుపుతున్న పోరులో భాగంగా అందరిలో ఈ మహమ్మారి నివారణ పై అవగాహన మరియు భిన్నత్వంలో ఏకత్వం కొరకై అన్నిరకాల సవాళ్లనూ ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి రావాలని కోరుకుంటు కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర  గవర్నర్‌ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్‌ గారు ప్రజలకు 05 ఏప్రిల్ 2020 నాడు రాత్రి 9 గంటలకు ఎవరి ఇంట్లో వారు విద్యుత్‌ను 9 నిమిషాలపాటు ఆపేసి దీపాలు, కొవ్వొత్తి వెలిగించాలని, టార్చ్‌లైట్‌, మొబైల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ను వేయాలని తెలిపారు. ఈ సత్సంకల్పాన్నికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్లచంద్రశేఖర్ రావు గారు తన సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ, అందరూ విధిగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఆచరించాలి అని ప్రజలకు సూచించారు కాగా ఈ సంధర్భంగా ఎవ్వరూ కూడా తమ ఇండ్ల నుంచి బయటకు గుంపులుగా రావొద్దని, రోడ్లపైకి వెళకూడదన్నారు. ప్రజలు తమ ఇండ్ల ద్వారాలు, బాల్కనీలోనే ఉండి తగు జాగ్రత్త వహించి పెద్దవారి పర్యవేక్షణలో సురక్షితంగా జ్యోతులు వెలిగించాలని సూచించారు.


కావున మనమందరం సౌభ్రాతృత్వంతో ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యంతో ఒక్కటై ఒక చక్కటి అవగాహనతో కరోనా మహమ్మారిని కట్టడి చేసుకుందాం అలాగే మన శ్రేయోభిలాషుల పిలుపుమేరకు కరోనా మహమ్మారి వల్ల కమ్ముకొస్తున్న చీకటిని చీల్చేందుకు మనం అందరం జ్యోతులు వెలిగించి ఒక నూతనోత్సాహంతో మన సంఘటిత శక్తితో కరోనా మహమ్మారిని నివారించి జయించగలం అని మన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. ఇట్టి సత్సంకల్పంలో మనమందరం విధిగా పాలుపంచుకుందాం.



అసతోమా సద్గమయ  తమసోమా జ్యోతిర్గమయా  
మృత్యోర్మా అమృతంగమయ  ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనా సుఖినోభవంతు  
సమస్థ  సన్మంగళాని భవంతు

భావము: చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా, మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం తద్ద్వారా లోకంలో అందరూ సుఖశాంతులతో ఉండాలీ అని అర్ధం .

ఇట్లు

మీ
కిరణ్ కుమార్ క్యాదారి

3 comments: